చంద్రబాబు పిల్లి శాపాలకు ఉట్లు తెగవు: విజయసాయిరెడ్డి

  • తనవల్ల కాని పనులు మరెవరూ చేయలేరన్నట్టు చంద్రబాబు మాట్లాడారు
  • జగన్ అన్నింటినీ చేసి చూపిస్తారు
  • మీకు మీరే పొగుడుకుంటున్నారా మందలగిరి మారాజా?
టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారా లోకేష్ లపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. టీడీపీ మహిళా కార్యకర్త పద్మను వైసీపీవాళ్లు అవమానించడంతో ఆమె ప్రాణలు తీసుకుందని... ఈ హత్య శాపంగా మారి వైసీపీని పతనం చేస్తుందన్న వ్యాఖ్యలపై స్పందించిన విజయసాయి... చంద్రబాబు పిల్లి శాపాలకు ఉట్లు తెగవని ఎద్దేవా చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం వీలు కాదు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంలో చేయడం అసాధ్యమని చంద్రబాబు అన్నారని... తనవల్ల కాని పనులు ఇంకెవరూ చేయలేరన్నట్టుగా మాట్లాడారని... ఇచ్చిన మాట ప్రకారం వీటన్నింటినీ జగన్ చేసి చూపిస్తారని చెప్పారు.

లోకేశ్ గురించి మాట్లాడుతూ, చంద్రబాబుగారేమో ఆకాశమంట, లోకేశేమో మిరుమిట్లు గొలిపే నక్షత్రమంట... ఆకాశంపై ఉమ్మేయవద్దని సలహా ఇస్తున్నాడని విమర్శించారు. 'మాది అందనంత స్థాయి' అని మీకు మీరే పొగుడుకుంటున్నారా మందలగిరి మారాజా? అని ఎద్దేవా చేశారు.
Go Back to Shorts
Vijayasai Reddy
YSRCP
Telugudesam
Chandrababu
Nara Lokesh
Jagan

More Telugu News